హైదరాబాద్ మహా నగరానికి కూత వేటు దూరంలో..
శతాబ్దాల చరిత్ర గల దేవాలయం నిత్యం భక్తుల పూజలతో అవ్యక్త అనుభూతిని కలిగిస్తున్నది. తమిళనాడు లోని కంచి దేవాలయం లాంటి ఆలయాన్ని పోలిన దేవాలయం తెలంగాణ లో కొడకంచిలో ఉంది. కంచిలో ఉన్నవిధముగా బంగారు, వెండి బల్లులు ఇక్కడి ఆలయంలోను ఉన్నాయి.కొడకంచిలో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆదినారాయణ స్వామి కొలువైయున్నాడు
తెలంగాణాలోని కంచి ఆలయం... కొడకంచి
తెలంగాణ రాష్ట్రము సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గం లోని జిన్నారం మండలంలోని కొడకంచి లో నిత్యం భక్తుల పూజలతో కంచి లాగా విరాజిల్లుతున్న ఓ దేవాలయం తెలంగాణలో దర్శనమిస్తుంది. కంచికి వెళ్ళాకున్నవారు .. కొడ కంచికి వెళ్లాలనేది నానుడి. ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ దేవాలయానికి తొమ్మిది శతాబ్దాలగల చరిత్ర ఉన్నది.
ఈ దేవాలయం తెలంగాణ లోని జిన్నారం మండలంలో జిన్నారానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో ఆదినారాయణమూర్తి శ్రీదేవి భూదేవి సమేతుడై కొలువైయున్నాడు. పురాతనకాలంలో నిర్మితమైన ఈ ఆలయం బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియక పోయినా తెలంగాణలో బాగా ప్రాచుర్యం గల దేవాలయం. తమిళనాడు లోని కంచి దేవాలయం కు ఉన్న ప్రాధాన్యతే ఈ కొడకంచి దేవాలయానికి ఉంది. దేశవిదేశాల నుండి భక్తులు సైతం కొడకంచి దేవాలయాన్ని సందర్శిస్తారు. కంచి ఆలయం లో ఎలాగైతే దోష నివారాణార్ధం పూజలు నిర్వహిస్తారో కొడకంచిలో కూడా అలాగే పూజలు నిర్వహిస్తారు .
ఆదినారాయణ స్వామి ఆలయ స్థలపురాణం
భక్తుల కోరికలు తీర్చుతూ, సుఖసంతోషాలను ప్రసాదిస్తున్న కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయం అధిక భక్తుల విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి 900 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో ఎక్కువ భక్తులు వస్తున్నారు . దీనికి ప్రధాన కారణం స్వామి వారి ప్రసన్నత. విష్ణు సహస్ర నామంలో భీష్మాచార్యుల తెలిపిన వివరాల ప్రకారం, ధర్మాన్ని అనుసరించి జీవులను ఉద్దరించడానికి వచ్చిన వారే శ్రీ మహావిష్ణువు యొక్క అవతార రూపమే ఆదినారాయణ స్వామిఅని . ఈ స్వామి రూపం చుసిన భక్తులకు ఆశ్రయం కల్పిస్తూ మోక్ష ప్రాప్తిని అందిస్తున్నారు.
స్థల పురాణం ప్రకారం, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అల్లాని రాజవంశానికి ఆదినారాయణ స్వామి వారు కులదైవంగా ఉండేవారు. అల్లాని రామోజీరావు అను రాజుకు స్వామివారు స్వప్నం లో ప్రత్యక్షమై, దగ్గర లోని అడవిలో తన విగ్రహం ఉన్నదని తెలియజేసారు. ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి దేవాలయం నిర్మించి పూజలు చేయాలని ఆదేశించినట్లు ప్రాచీన కథనాలు చెబుతున్నారు. దీంతో అల్లాణి వంశస్తులతో పాటు,కొడకంచి గ్రామ ప్రజలందరూ కలసి స్వామివారి విగ్రహం కోసం వెతకటం మొదలు పెట్టారు . అయినా విగ్రహం ఎక్కడ కనిపించలేదు . దాంతో మరోసారి స్వామి వారు అల్లాణి రామోజీరావు కు కలలోకి వచ్చి తెల్లవారే లోపు మీ ఇంటిముందు గరుడ పక్షి ఉంట్టుంది మీకు ఆ గరుడపక్షే దారి చూపుతూ నేను మంబాపూర్ అటవీ ప్రాంతం ఉన్న నా స్థానానికి తీసుకువెళ్తుందని ఆ విగ్రహం కొడకంచి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల ఓ గుట్టపై ప్రతిష్టించాలని స్వామి చెప్పారు .
గరుడపక్షి తో వెళ్లి మంబాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అల్లాణి వంశస్తులకు ఒక పుట్టలో స్వామి వారి విగ్రహం కనిపించింది. ఈ విగ్రహాన్ని కొడకంచిలోని ఓ గుట్టపై ప్రతిష్టించారు, ఆనాటి అల్లాని వంశస్థులు ఒక్కొక్కరిగా ఆదినారాయణ స్వామికి దేవాలయం కట్టడం మొదలు పెట్టి మూడోతరం వరకు కొడకంచి ఆలయం నిర్మిచటం పూర్తిచేశారు. ఈ ఆలయం ఇప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది.
ఒక్క రాయితో.నిర్మించిన ఆదినారాయణ స్వామి ఆలయం
ఆదినారాయణ స్వామి ఆలయం ప్రాంగణం అద్భుతమైన శిల్పకళతో అలంకరించబడి, కళాత్మకతతో నిండుగా ఉట్టిపడుతుంది. విశాలమైన ముఖ మండపం ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణ. గర్భగుడి పక్కనే లక్ష్మీదేవి ఆలయం, మరో పక్క గోదాదేవి ఆలయాలు ఉన్నాయి.గర్భగుడికి ఎదురుగా నల్లరాతితో నిర్మించిన ద్వాదశాల్వాల సన్నిధి మరింత వైభవంగా కనిపిస్తుంది.ఆలయ అంతర్భాగంలో ఉన్న మేడి వృక్షం కింద శివాలయం నిర్మించారు. ఆలయ పరిసరాల్లో కోనేరు మరియు ప్రాకార మండపాలు, యజ్ఞాది పూజల కోసం నిర్మించిన కట్టడాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ ఆలయం సంప్రదాయ సంపదకు, శిల్పకళకు ప్రతీకగా నిలుస్తోంది.
కొడకంచి దేవాలయం లో పూజలు..
ప్రతి సంవత్సరంలో మాఘమాసంలోని మాఘశుద్ధ విదియ నుంచి ఏకాదశి వరకు కొడకంచి ఆలయం లో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వైష్ణవ సంబంధ పర్వదినాలన్నీ ఈ దేవాలయంలోవిశేష పూజలు జరుపుతారు. కొడకంచి బ్రహ్మోత్సవాలకు ప్రతి యేటా లక్షలాది భక్తులు హాజరై దోషనివారణ పూజలు చేస్తారు. . దేశంలోని అన్ని రా ష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం అనవాయితీగా మారింది. స్టా నికులు ఏ పని చేయాలనుకున్న కొడకంచి ఆలయం లో పూజలు చేశాకే మొదలు పెట్టడం ఇక్కడ ఆచారంగా ఉన్నది .
ఆలయం మూసి వున్నచో అక్కడ ఉన్న వారిని అడిగించో వారు గుడి తాళం తీస్తారు మరిన్ని వివరాలకు పూజారికి కాల్ చేయవచ్చును .
కారీక్ (పూజారి) .. 7842816927
గోపాలకృష్ణ ( పూజారి సోదరుడు) .. 9985830802
రవాణా సౌకర్యం :-
కొడకంచి చేరుకోవడం కోసం మార్గాలు
1. హైదరాబాద్ నుంచి (44 కిలోమీటర్లు):
మహాత్మా గాంధీ బస్టాండ్ నుండి బేగంపేట్ బాలానగర్ ,సూరారం ,గండి మైసమ్మ , గుండ్లపోచంపల్లి ,వావిలాల ,పుట్టగూడ ,కొడకంచి
2. వరంగల్ నుండి 184 కిలోమీటర్లు:-
వరంగల్ ,స్టేషన్ ఘనపూర్ ,జనగాం ,భువనగిరి ,ఘట్కేసర్ నుండి అవుటర్ రింగ్ రోడు మీదుగా గుండ్లపోచంపల్లి , బొమనాకుంట ,మాదారం,కొడకంచి చేరుకోవచ్చు.
3. పటాన్ చెరువు నుండి (14 కిలోమీటర్లు):
పటాన్ చెరువు ,బొమనాకుంట ,మాదారం,కొడకంచి చేరుకోవచ్చు.
No comments
Post a Comment