Vamu Annam:జీర్ణ సమస్యలకు వాము అన్నంతో చెక్ పెట్టవచ్చును
Vamu Annam:మనం చిరుతిళ్లు తయారు చేసేటప్పుడు మరియు వండేటప్పుడు ఉపయోగించే పదార్థాలలో వాము ఒకటి. వామ్ ఆహారం యొక్క రుచిని పెంచడమే కాకుండా, శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీని నుండి మనం పొందగలిగే ప్రయోజనాలు ఇవే కాదు. వాము అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉంది. జీర్ణక్రియకు సహాయం చేయడంలో మరియు మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో వామ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వాము పంటి నొప్పులు, చెవినొప్పులు మరియు ఆర్థరైటిస్ అసౌకర్యాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సాధారణ జలుబులు కొన్ని వాములను వేయించి, తర్వాత తరచుగా వాసన చూస్తుంటే నయమవుతుంది. వాము మహిళలకు సాధారణ ఋతు చక్రం ప్రక్రియలో కూడా సహాయపడుతుంది. వాము అనేక రకాల ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించబడుతుంది.
వామును ఉపయోగించి వాము అన్నాన్ని తయారు చేసుకుని తినవచ్చు. ఇలా వాము అన్నాన్ని తయారు చేసుకుని తినడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. వాము అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి.దాని తయారీకి కావల్సిన పదార్థాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాము అన్నం తయారీకి కావల్సిన పదార్థాలు:-
బియ్యం – 2 కప్పులు
వాము – ఒకటిన్నర టీ స్పూన్,
జీలకర్ర- ఒక టీస్పూన్
ఎండు మిరపకాయలు- 2
కరివేపాకు – అర కప్పు
ఉప్పు -అర టీస్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్లు
Vamu Annam:జీర్ణ సమస్యలకు వాము అన్నంతో చెక్ పెట్టవచ్చును
వాము అన్నం తయారు చేసే విధానం:-
ఒక గిన్నెలో అన్నం వండుకోవాలి . అన్నాన్ని ఒక ప్లేటులో వేసి చల్లగా చేసి ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి నూనె వేడిక్కిన తరువాత ఎండు మిర్చిని వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తరువాత వాము, జీలకర్ర వేసి వేయించి తరువాత కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలిపి మూడు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వాము అన్నం తయారవుతుంది.
వాము ఘాటుగా ఉంటుంది. కనుక ఇందులో కారాన్ని వేసుకోకూడదు. ఒక వేళ వేసుకున్నా కూడా తక్కువగా వేసుకోవాలి. అజీర్తి మరియు పొట్టలో గ్యాస్ వంటి వాటితో బాధపడుతున్నప్పుడు ఇలా వాము అన్నాన్ని తయారు చేసుకుని తినడం వల్ల అజీర్తి వంటి వాటి నుండి ఉపశమనం లభిస్తుంది. చిన్న పిల్లలకు కూడా ఇలా అప్పుడప్పుడూ వాము అన్నాన్ని తయారు చేసి పెట్టడం వల్ల అజీర్తి వల్ల కలిగే కడుపు నొప్పి తగ్గుతుంది. ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.
No comments
Post a Comment