Menthikura Pappu : మెంతికూర పప్పును ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది
Menthikura Pappu : మనం వండడానికి ఉపయోగించే కూరగాయలలో మెంతికూర ఒకటి. మెంతికూరను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించవచ్చును . మెంతులు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. దీని అర్థం బరువు ను తగ్గించడానికి ప్రయత్నిస్తున్న వారు కూడా దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. మెంతులు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. మెంతులు ఎముకలను మంచి ఆకృతిలో ఉంచడంలో మరియు మధుమేహాన్ని నివారించడంలో కూడా సహాయపడతాయి.
నోటి అల్సర్‌లను తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మెంతులు బాగా సహకరిస్తాయి. శిశువుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు కూడా మెంతికూర ఉపయోగపడుతుంది. విభిన్నమైన ఆహార పదార్థాల తయారీలో మెంతికూరను ఉపయోగిస్తాము. మనము వండడానికి ఎండిన మెంతి ఆకులను కూడా ఉపయోగిస్తాము. మెంతికూరతో చేసిన పరోటాలు రుచికరంగా ఉంటాయి. మెంతికూరను ఉపయోగించి రుచికరమైన పప్పులను తయారు చేయడం కూడా సాధ్యమే. మెంతికూర పప్పును ఎలా తయారుచేయాలి.దాని తయారీకి కావలసిన పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము .
మెంతికూర పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
కంది పప్పు- ఒక కప్పు
టొమాటో ముక్కలు – రెండు
తరిగిన పచ్చిమిర్చి – 2
కరివేపాకు- ఒక రెమ్మ
పసుపు -అర టీ స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
నీరు- 2కప్పులు.
తాలింపు చేయడానికి కావలసిన పదార్థాలు:-
నూనె – 1 మరియు 1/2 టేబుల్ స్పూన్
ఆవాలు – అర టీస్పూన్మి
మినప పప్పు- అర టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
ధనియాలు – పావు కప్పు
మెంతులు- 8
పచ్చి వెల్లుల్లి రెబ్బలు- 6
ఎండు మిర్చి – 2
పచ్చిమిర్చి – 3
ఉల్లిపాయ ముక్కలు – 1
కరివేపాకు- ఒక రెమ్మ
తరిగిన మెంతి కూర -ఒక కట్ట (మీడియం)
కారం – ఒక టీస్పూన్త
నానబెట్టిన చింతపండు- 5 గ్రాములు
కొత్తిమీర తరిగినవి – కొద్దిగా
Menthikura Pappu : మెంతికూర పప్పును ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది
మెంతి కూర పప్పును తయారు చేసే విధానము:-
ముందుగా కుక్కర్ తీసుకొని దానిలో శుభ్రంగా కడిగిన కందిపప్పుతోపాటు ఉప్పు మినహా పప్పు తయారీకి కావల్సిన పదార్థాలన్నింటినీ వేసి మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ పెట్టి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన పప్పులో రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి వేడి చేసి దానిలో నూనె వేసి కాగాక తాళింపు పదార్థాలన్నీ వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగాక తరిగిన మెంతి కూరను వేసి బాగా వేయించుకోవాలి. మెంతి కూరలో ఉండే నీళ్లన్నీ పోయే వరకు బాగా వేయించి కారం వేసి కలుపుకోవాలి. ఇలా ఉడికిన కూరలో ముందుగా ఉడికించిన పప్పును ,అలాగే చింతపండు గుజ్జును వేసి బాగా కలిపి ఉడికించాలి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసి కలుపుకోవాలి .ఈ విధముగా రుచికరమైన మెంతికూర పప్పు తయారువుతుంది .
ఈ పప్పు పలుచగా తినే వారు దీనిలో కొంచెం నీరు కలపవచ్చును.మెంతి కూర పప్పును అన్నం, రొట్టె, చపాతీ, రాగి సంగటి తీసుకోవడం చాలా రుచికరంగా ఉంటుంది . ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది .
No comments
Post a Comment