Coconut Milk Rice:రుచికరమైన కొబ్బరిపాలఅన్నం ఈ విధంగా తయారు చేయండి
Coconut Milk Rice: మనం రోజువారీ ఆహారంలో భాగంగా పచ్చి కొబ్బరిని కొన్ని సార్లు తీసుకుంటాము. పచ్చి కొబ్బరిని నేరుగా తింటారు, కానీ పచ్చి రూపంలో లేదా పచ్చి కొబ్బరిని ఉపయోగించి స్వీట్‌లను తయారు చేస్తాము.పచ్చి కొబ్బరి నుండి తయారైన కొబ్బరి పాలను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటారు.
ఆహారం కోసం కొబ్బరి పాలు తీసుకోవడం మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో, అలాగే శరీరంలో వాపులు మరియు నొప్పిని తగ్గించడంలో కొబ్బరి పాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కొబ్బరి పాలను ఉపయోగించి వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా తయారు చేసుకోవచ్చును. కొబ్బరి పాలతో చేసే వంటకాలలో కొబ్బరి పాల అన్నం కూడా ఒకటి. కొబ్బరి పాల అన్నం చాలా రుచికరంగా ఉంటుంది. ఇది తయారు చేయడం సులభం. కొబ్బరి పాలను ఉపయోగించి అన్నం ఎలా తయారు చేయాలి. దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము .
కొబ్బరి పాల అన్నం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
నీళ్లలో నానబెట్టిన బియ్యం – అర కిలో
కొబ్బరికాయలు-2,
తరిగిన పచ్చిమిర్చి- 3
దాల్చిన చెక్క- 2
లవంగాలు – 10
ఏలకులు – 6
అల్లం-వెల్లుల్లి పేస్ట్ -టీ స్పూన్
జీడిపప్పు- 10
ఉప్పు – రుచికి తగినంత
నూనె- మూడు టీ స్పూన్లు.
Coconut Milk Rice:రుచికరమైన కొబ్బరిపాలఅన్నం ఈ విధంగా తయారు చేయండి
కొబ్బరి పాల అన్నం తయారు చేసే విధానము:–
ముందుగా కొబ్బరి కాయలను తీసుకుని వాటిని పగల కొట్టాలి. అలా కొట్టిన దాని కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని తీసుకోవాలి. ఆ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అలా కట్ చేసిన కొబ్బరి ముక్కలను ఒక జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దానికి తగినంత నీరు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పలుచటి బట్టను తీసుకుని దానిపై మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పోయాలి. ఆ మిశ్రమాన్ని చేతితో వత్తుతూ కొబ్బరి పాలను తీసుకోవాలి. బియ్యం వండడానికి తగినంత కొబ్బరి పాలురానప్పుడు అందులో తగినన్ని నీళ్లను పోసి కలుపుకోవాలి.
స్టవ్ ఆన్ చేసుకోవాలి . దాని మీద ఒక గిన్నెపెట్టి వేడి చేయాలి . గిన్నె వేడి అయినా తరువాత దానిలో నూనె పోయాలి . ఇప్పుడు నూనె కాగిన తరువాత దాల్చినచెక్క లవంగాలు మరియు యాలకులు వేసి వేయించాలి. ఇవి వేగినా తరువాత జీడిపప్పు వేసి వేయించాలి.
పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తరువాత ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి పాలలో కొద్దిగా ఉప్పు వేసి బాగా మరిగించాలి. కొబ్బరి పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి మూత పెట్టాలి.
అన్నం ఉడికిన తర్వాత మూత తెరిచి ఒక్కసారి అన్నాన్ని కలపాలి. ఈ విధంగా కోకోనట్ మిల్క్ రైస్ చాలా రుచికరంగా తయారవుతుంది. ఇది ఒంటరి భోజనంగా లేదా ఇతర మసాలా కూరలతో కలిపి తీసుకుంటే రుచికరంగా ఉంటుంది.
కొబ్బరి పాల అన్నాన్ని తయారు చేసుకుని తినడం వల్ల కొబ్బరి పాల వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరి పాలు ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
No comments
Post a Comment