Jeera Rice:జీరా రైస్ చాలా రుచికరమైనది ఇలా చేసి తిన్నచో ఆరోగ్యకరం
Jeera Rice: మనం వంటింట్లో రకరకాల వంటలను తయారు చేస్తాము . ఈ వంటలను తయారు చేయడానికి ముందుగా మనం తాళింపును చేస్తాం. జీలకర్ర అనేది తాలింపులో ఉపయోగించే ఒక పదార్ధం. ఇది మనందరికీ తెలిసిందే. కానీ జీలకర్ర వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియవు. జీలకర్రను వంటలో ఉపయోగించడం వల్ల ఆహార రుచిని మెరుగుపరచడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరంలో మంట మరియు నొప్పిని తగ్గించడంలో మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో జీలకర్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వంటతో పాటు, జీలకర్రను జీరా రైస్‌ని తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. జీరా అన్నం చాలా రుచికరమైనది. మీరు దీన్ని సులభతరం చేయవచ్చు. ఈ రుచికరమైన జీరా రైస్ ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీరా రైస్ తయారీ చేయడానికి కావలసిన పదార్థాలు:-
నానబెట్టిన బియ్యం – 1 కప్పు
జీలకర్ర – 1 టేబుల్ స్పూన్
నెయ్యి- 2 టీ స్పూన్లు
దాల్చిన చెక్క- ఒకటి
పొడవు, లవంగాలు- 5
యాలకులు – 3
ఉప్పు – రుచి ప్రకారం
కరివేపాకు – ఒక రెమ్మ
కొత్తిమీర- కొద్దిగా
నీరు – ఒకటిన్నర కప్పులు.
Jeera Rice:జీరా రైస్ చాలా రుచికరమైనది ఇలా చేసి తిన్నచో ఆరోగ్యకరం
జీరా రైస్ తయారు చేసే విధానము :-
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నెపెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెవేడి అయ్యాక దానిలో నెయ్యి వేసుకోవాలి . నెయ్యి కరిగిన తరువాత కరివేపాకు ,జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి బాగా
వేగిన తరువాత లవంగాలు, యాలకులు,దాల్చిన చెక్క కూడా వేసి వేయించాలి. ఇప్పుడు బాగా వేగిన మిశ్రమానికి ముందుగా నానబెట్టిన బియ్యాన్ని,ఉప్పును ,కొత్తిమీరను వేసి కలిపి నీళ్లు పోసి గిన్నె మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తరువాత ఒకసారి మూత తీసి అంతా కలుపుకోవాలి. ఈ విధంగా రుచిగా ఉండే జీరా రైస్ తయారవుతుంది.దీనిని బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. జీరా రైస్ ను నేరుగా లేదా మిర్చి కా సాలన్, చికెన్ కుర్మాలతో కలిపి తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.
అప్పుడప్పుడు ఇలా జీరా రైస్ ను తయారు చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడంతోపాటు జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. జీలకర్రను తరుచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి బాగా మెరుగుపడుతుంది. జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. జీలకర్ర మహిళలకు ఋతు చక్రం నియంత్రించడానికి కూడా ఉపయోగించవచ్చును . ముఖంలో ముడతలు రాకుండా, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు జీలకర్ర ఉపయోగపడుతుంది.
No comments
Post a Comment