Cabbage Green Peas Curry : రుచికరమైన క్యాబేజీ పచ్చిబఠాణీల కూర ఇలా వండండి

 

Cabbage Green Peas Curry :క్యాబేజీ మనకు అందుబాటులో ఉన్న అనేక కూరగాయల్లో ఒకటి. చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. క్యాబేజీ అందించగల ప్రయోజనాలు నమ్మశక్యం కానివి. దీనిలో మాంసాహారాలకు సమానమైన ప్రోటీన్లు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇవి అనారోగ్యాలను నివారిస్తాయి. క్యాన్సర్‌ కణాల పెరుగుదలను కూడా అడ్డుకుంటాయి. అందుకే క్యాబేజీని తరచుగా తీసుకోవాలి.పచ్చి బఠానీలతో కలిపి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది.. అదనంగా, ఇందులో పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాబేజీ పచ్చి బఠాణీల కూరను ఎలా తయారు చేయాలి . ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

క్యాబేజీ పచ్చి బఠానీల కూరకు తయారికి కావలసిన పదార్థాలు:-

సన్నగా తరిగిన క్యాబేజీ – 2 కప్పులు
పచ్చిమిర్చి-మూడు
నానబెట్టిన పచ్చి బఠానీలు- అర కప్పు
అల్లం ముద్ద- అర టీస్పూన్
ఉప్పు -రుచికి సరిపడా
ఆవాలు – అర టీస్పూన్‌
కరివేపాకు – నాలుగు రెమ్మలు
పసుపు – కొద్దిగా
నూనె – రెండు టీస్పూన్లు.

Cabbage Green Peas Curry : రుచికరమైన క్యాబేజీ పచ్చిబఠాణీల కూర ఇలా వండండి

క్యాబేజీ పచ్చి బఠానీల కూర తయారు చేసే విధానము:-

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ వేడి అయినా తరువాత దానిలో నూనెను పోయాలి.నూనె వేడి అయ్యాక ఆవాలు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం పేస్ట్‌, పసుపు ఒకటి తరువాత ఒకటి వేసి బాగా వేయించాలి. అలా వేగిన తరువాత క్యాబేజీ, పచ్చి బఠాణీలను వేసి అరకప్పు నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి.

 

సన్నని మంటపై ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు ఉడికించి గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు దానికి ఉప్పు కలిపి మళ్లీ మూతపెట్టి మరో 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి. దీనిపై తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి . సిమ్‌లో పెట్టి వండడం వల్ల క్యాబేజీ వేగడంతోపాటు స్టీమ్‌ అవుతుంది. దీని వల్ల పోషక విలువలు పోకుండా ఉంటాయి. క్యాబేజీకి స్వతహాగా ఉండే వాసన కూడా బాగా తగ్గుతుంది. అన్నం లేదా చపాతీ దేంట్లో తిన్నా సరే ఈ కూర రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు