Sesame Laddu :ప్రతిరోజూనువ్వుల లడ్డూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు
Sesame Laddu : నువ్వులు.. ఇవి తెలియని వారుండరు. అవి ఏదైనా వంటగదిలో ఉండాలి. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని అందరికీ తెలిసిందే. నువ్వులలో ఫ్లోటేట్స్, అమైనో ఆమ్లాలు థయామిన్, నియాసిన్, విటమిన్ ఎ విటమిన్ ఇ కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, పొటాషియం మరియు మన శరీరానికి అవసరమైన అనేక ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. నువ్వులను వంటలో ఉపయోగిస్తారు. నువ్వులను స్వీట్ల తయారీకి కూడా ఉపయోగించవచ్చును . వివిధ ఆహార పదార్థాల తయారీతో పాటు, నువ్వులను ఉపయోగించి రుచికరమైన లడ్డూలను తయారు చేసుకోవచ్చు. రుచికరమైన నువ్వుల లడ్డూలను 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో తయారు చేయడం సాధ్యపడుతుంది. రుచికరమైన ఈ నువ్వుల లడ్డూలు ఎలా తయారుచేయాలో..వాటిని తయారుచేయడానికి కావలసిన పదార్థాలు గురించి తెలుసుకుందాం.
నువ్వుల లడ్డూ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
నువ్వులు-ఒక కప్పు
బెల్లం – 3/4 కప్పు
నెయ్యి -2 టేబుల్ స్పూన్లు.
ఏలకుల పొడి- 1/4 టీస్పూన్.
Sesame Laddu :ప్రతిరోజూనువ్వుల లడ్డూ తీసుకుంటే కలిగే ప్రయోజనాలు
నువ్వుల లడ్డూలు తయారు చేసే విధానము :-
ముందుగా ఒక కడా యిలో నువ్వులను వేసి చిన్న మంటపై నువ్వులు రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నువ్వులు కొద్దిగా చల్లగా అయిన తరువాత ఒక జార్ లోకి తీసుకోవాలి. దానిలో తురిమిన బెల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో నెయ్యి మరియు యాలకుల పొడి వేసి, ఆపై కావలసిన పరిమాణం ప్రకారం లడ్డూలుగా చుట్టుకోవాలి.ఇలా చేయడం వల్ల ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డూలు తయారవుతాయి.
వంట చేయడం రాని వారు కూడా ఈ నువ్వుల లడ్డూలను చాలా సులభంగా తయారు చేయవచ్చును .వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచితే 20 రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ నువ్వుల లడ్డూలను రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినడం ద్వారా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో మరియు రక్తపోటును తగ్గించడంలో నువ్వులు మనకు బాగా సహాయపడతాయి.
నువ్వులను ఆహారంలో తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. జుట్టు మరియు చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. నువ్వులు క్యాన్సర్ నుండి శరీరాన్ని రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే నువ్వుల తో చేసిన లడ్డూలను వండుకుని తినడం ద్వారా మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చును .
No comments
Post a Comment