యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మరియు ఐఎఫ్ ఎస్ ఉద్యోగ నోటిషికేషన్స్ UPSC Civil Services 2025
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ)/ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ 2025 ను కేద్ర ప్రభుత్వం విడుదల చేసినది ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సివిల్, ఫారెస్టు సర్వీసులకు సంభందిచిన ప్రభత్వ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుచున్నది . దాదాపు 979 ఉద్యోగాలు సివిల్ సర్వీసెస్ నుండి , 150 ఐఎఫ్ఎస్ ఉద్యోగాలను భర్తీ చేయుచున్నారు . అభ్యర్థులు డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను . డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు అందరూ అర్హులే అని తెలిపినారు .
ఉద్యోగ వివరాలు: ఖాళీలు
* సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2025: 979 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి
ధరఖాస్తు దారుని అర్హత: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి
* ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్- 2025: 150 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి
ధరఖాస్తు దారుని విద్యా అర్హతలు:
1). ఫారెస్ట్రీ, అగ్రికల్చర్,
2). వెటర్నరీ సైన్స్,
3). బోటనీ,
4). కెమిస్ట్రీ,
5). జియోలజీ, ఫిజిక్స్,
6). మ్యాథమెటిక్స్,
7). స్టాటిస్టిక్స్,
8). జువాలజీ,
ఇంజినీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండవలెను .
వయసు పరిమితి:- ధరఖాస్తు దారుని వయసు 01.08.2025 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీకి వయసు కు సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం: రాత పరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
సివిల్స్, ఫారెస్టు సర్వీస్‌లకు రెండింటికీ ఒకే ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. మెయిన్స్ వేర్వేరుగా జరుగుతాయి.
ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉన్నాయి . ఒక్కో పేపర్‌కు 2 గంటల్లో 200 మార్కులకు ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్ తరహాలో ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల ను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌కు తొమ్మిది పేపర్లు (ఎస్సై, జనరల్ స్టడీస్, ఆప్షనల్ సబ్జెక్టులు) ఉంటాయి, ఫారెస్ట్ సర్వీసెస్‌కు 6 పేపర్లు (జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఆప్షనల్ సబ్జెక్టులు) ఉంటాయి.
దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు ఉండదు).
దరఖాస్తు చేయు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రిలిమ్స్‌పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మెయిన్స్‌పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
ముఖ్య తేదీల వివరాలు :
* ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 22.01.2025.
* ఆన్‌లైన్ దరఖాస్తు చేయుటకు తేదీ: 11.02.2025.
* సివిల్స్, ఐఎఫ్‌ఎస్ ప్రాథమిక పరీక్ష రాయుట తేదీ : 25.05.2025.
No comments
Post a Comment