పనీర్ కోఫ్తా కర్రీ వండటం తెలుగులో
కావలసినవి
కోఫ్తా కోసం: పనీర్- వంద గ్రాములు, బంగాళదుంపలు- రెండు (ఉడికించి మెత్తగా చేయాలి), కోవా- 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు- చిటికెడు, కారం- ఒక టీస్పూన్, కొత్తిమీర- ఒక కట్ట, జీలకర్ర- అర టీస్పూన్, ధనియాలు- అర టీస్పూన్, ఆవాలు- రెండు టేబుల్‌స్పూన్లు, ఎండు ద్రాక్ష- 25 గ్రాములు, సెనగపిండి- 50 గ్రాములు, ఉప్పు- రుచికి తగినంత
గ్రేవీ కోసం: నూనె- మూడు టేబుల్‌స్పూన్లు, దాల్చిన చెక్క- చిన్నముక్క, యాలకులు- ఆరు, లవంగాలు- పన్నెండు, బిర్యానీ ఆకులు- మూడు, జీలకర్ర- రెండు టీస్పూన్లు, ఉల్లిపాయలు- రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు- నాలుగు టీస్పూన్లు, కారం- ఒకటిన్నర స్పూన్, ధనియాలు- ఒక టీస్పూన్, టొమాటో ప్యూరీ- 100 గ్రాములు, పాలు- 100 ఎంఎల్, పెరుగు – ఐదు టేబుల్‌స్పూన్లు, పంచదార- అర టీస్పూన్, ఉప్పు- తగినంత.
పనీర్ కోఫ్తా కర్రీ వండటం తెలుగులో
తయారీవిధానం
ఒక పాత్రలో పనీర్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంపలు తీసుకొని అందులో కోవా, అల్లంవెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, ఎండుద్రాక్ష, కొత్తిమీర వేసి కలిపి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొడి పిండిలో అద్దుకుంటూ చిన్న చిన్న ఉండలు (కోఫ్తాలు)గా చేసుకొని 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేగించాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత టొమాటో ప్యూరీ, పాలు పోసి చిన్నమంటపై ఉడికించాలి. పెరుగు, పంచదార వేసి కలుపుకోవాలి. మూతపెట్టి పది నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ తయారవుతుంది. మరొక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఫ్రిజ్‌లో పెట్టిన కోఫ్తాలను తీసి వేగించాలి. తరువాత వాటిని గ్రేవీలో వేసి చిన్న మంటపై ఉడికించాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈ కోఫ్తాలు రుచికరంగా బాగుంటాయి.
No comments
Post a Comment