శ్రీ షిర్డీ సాయిబాబా దర్శనం హారతి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి,How to book online Sri Shirdi Saibaba Darshan Aarti tickets
షిర్డీ భారతదేశంలోని మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం, ఇది షిర్డీ సాయిబాబా ఆలయానికి ప్రసిద్ధి. సాయిబాబా ఆశీస్సులు పొందేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇటీవలి సంవత్సరాలలో, ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యాల కారణంగా ఆలయంలో దర్శనం మరియు హారతి టిక్కెట్ల బుకింగ్ ప్రక్రియ చాలా సౌకర్యవంతంగా మారింది.
షిర్డీ సాయిబాబా దర్శనం హారతి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలో
షిర్డీ సాయి బాబా హారతి టిక్కెట్ల ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం చాలా సులభం . షిర్డీ సాయి బాబా హారతి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడంలో సహాయపడుతుంది.
ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
షిర్డీ సాయి బాబా ట్రస్ట్ యొక్క అధికారిక సైట్‌ను సందర్శించండి. వెబ్‌సైట్ యొక్క లింక్ ఇక్కడ ఉన్నది URL: https://www.sai.org.in.
ఈ షిర్డీ సాయి బాబా వెబ్‌సైట్ అన్ని రకాల టిక్కెట్లు మరియు సేవలను ఆన్‌లైన్‌లో అందించడానికి అధికారికంగా అనుమతి ఉన్న దేవాలయం యొక్క ఏకైక వెబ్‌సైట్.
వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్/లాగిన్ చేయడం ఎలా
మీరు ఇప్పటికే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్నట్లయితే, మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ వివరాలను ఉపయోగించి లాగిన్ చేసుకోవాలి .
మీరు కొత్త వారు అయినచో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. "Sign Up" లేదా "Register" అనే బటన్‌ను క్లిక్ చేసి, మీ వివరాలను నమోదు చేయాలి . ఇందులో మీ పేరు ను , ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ మరియు పాస్‌వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టేషన్ చేసుకోవాలి .
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, మీ ఇమెయిల్ ఐడి, మరియు పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ చేసుకోవాలి.
షిర్డీ సాయి బాబా హారతి టిక్కెట్లను ఎంచుకోండి
లాగిన్ అయిన తర్వాత, మీ డాష్‌బోర్డ్‌లో కనిపించిన "Book Aarti Tickets" లేదా "Online Booking" అనే ఎంపికపై క్లిక్ చేయాలి .
ఇక్కడ మీరు అన్ని రకాల హారతి టిక్కెట్లను చూస్తారు . ముఖ్యముగా షిర్డీలో నాలుగు ప్రధాన హారతి లు ఉన్నాయి:
కాకడ్ హారతి
మధ్యాహ్న హారతి
ధూప్ హారతి
శేజ్ హారతి
మీరు ఏ హారతి హాజరు కావాలనుకునే హారతి ని ఎంచుకోండి.
తరువాత తేదీ మరియు సమయాన్ని ఎంచుకోండి
హారతి ని ఎంచుకున్న తర్వాత, మీరు హాజరు కావాలనుకునే తేదీ మరియు సమయాన్ని ఎన్నిక చేసుకోవాలి.
హారతి టిక్కెట్లు సాధారణంగా 90 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చును . కాబట్టి, మీరు ముందుగా మీ దర్శన సమయం ఎన్నిక చేసుకోవాలి .
టిక్కెట్ల సంఖ్యను ఎంచుకోండి
మీరు బుక్ చేయాలనుకునే టిక్కెట్ల సంఖ్యను ఎన్నిక చేసుకోవాలి . ప్రతి వ్యక్తికి ఒక టిక్కెట్ అవసరం ఉంటుంది .
టిక్కెట్ల సంఖ్యను ఎంచుకున్న తర్వాత, "Proceed to Payment" లేదా "Next" అనే బటన్‌ను క్లిక్ చేయాలి .
పేమెంట్ విధానం
టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి , మీరు ముందుగా పేమెంట్ చేయాలి. పేమెంట్ విధానాలలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మరియు ఇతర ఆన్‌లైన్ పేమెంట్ ఎంపికలు ఉంటాయి.
మీరు ఇష్టపడే పేమెంట్ మెథడ్‌ను ఉపయోగించుకొని అవసరమైన వివరాలను నమోదు చేయండి.
పేమెంట్ విజయవంతం గా పూర్తయిన తర్వాత, మీకు టిక్కెట్ కన్ఫర్మేషన్ మీకు మెయిల్ మరియు SMS వస్తుంది.
టిక్కెట్ డౌన్‌లోడ్ చేయండి
పేమెంట్ పూర్తయిన తర్వాత, మీరు మీ యొక్క టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది PDF ఫార్మాట్‌లో ఉంటుంది.
ఈ టిక్కెట్‌ను మీరు ప్రింట్ తీసుకోవాలి లేదా మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. షిర్డీలో హారతి సమయంలో ఈ టిక్కెట్‌ను చూపించాలి.
హారతి సమయంలో
ఆరతి సమయంలో, మీరు మీ టిక్కెట్‌ను మరియు ఒక వాలిడ్ ఐడి ప్రూఫ్‌ను తీసుకువెళ్లాలి.
టిక్కెట్ మరియు ఐడి ప్రూఫ్‌ను చూపించిన తర్వాత మాత్రమే మీరు హారతి లో పాల్గొనగలరు.
క్యాన్సిలేషన్ మరియు రిఫండ్
ఏదైనా కారణంగా మీరు హారతి కి హాజరు కాలేకపోతే, మీరు టిక్కెట్‌ను క్యాన్సల్ చేసుకోవచ్చు.
క్యాన్సిలేషన్ ప్రక్రియ ను కూడా అదే వెబ్‌సైట్‌లో అందుబాటు లో ఉంటుంది . మీరు మీ ఖాతాలోకి లాగిన్ అయి, "My Bookings" లేదా "Booking History" లో క్యాన్సిల్ చేయాలనుకునే టిక్కెట్‌ను ఎన్నిక చేసుకోవాలి .
క్యాన్సిలేషన్ చేసిన తర్వాత, మీకు అమౌంట్ రిఫండ్ అందుతుంది. రిఫండ్ అమౌంట్ ప్రక్రియ బ్యాంక్ మరియు పేమెంట్ మెథడ్‌ను బట్టి 5 లేదా 7 వర్కింగ్ రోజులు పడుతుంది.
సహాయం మరియు మద్దతు
ఏదైనా సమస్యలు లేదా ప్రశ్నలు ఉంటే, మీరు వెబ్‌సైట్‌లోని "Help" లేదా "Support" విభాగాన్ని చూడవచ్చును
మీరు మీ యొక్క ఇమెయిల్ ద్వారా లేదా టోల్-ఫ్రీ నంబర్ ద్వారా కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించవచ్చు.
శ్రీ షిర్డీ సాయిబాబా దర్శనం హారతి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి,How to book online Sri Shirdi Saibaba Darshan Aarti tickets
Tags:shirdi darshan online booking,how to book shirdi darshan ticket online,online booking for shirdi sai baba darshan,how to book shirdi sai baba darshan pass online,shirdi online darshan booking,shirdi online darshan booking kaise kare,shirdi online booking,shirdi darshan,shirdi,shirdi sai baba,shirdi sai baba darshan pass online booking,shirdi sai baba online darshan ticket booking,shirdi online room booking,shirdi darshan without online booking
No comments
Post a Comment