Condensed Milk:ఇంట్లోనే సులభంగా మిల్క్ మెయిడ్‌ని తయారు చేసుకోవచ్చును
Condensed Milk: మన వంటగదిలో కనీసం ఒక్కసారైనా స్వీట్‌లు తయారుచేసుకుంటాము . మిల్క్‌మెయిడ్‌ను కొన్ని రకాల స్వీట్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దీనిని కండెన్స్‌డ్ మిల్క్ అని కూడా అంటారు. అలాగే, ఇది కేకులు, స్వీట్లు మరియు పుడ్డింగ్‌ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ మిల్క్ మెయిడ్ మనకు బయట ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఇంట్లో చేసుకునే వంటకం కాదని చాలా మంది నమ్ముతారు. అయితే, ఈ మిల్క్ మెయిడ్‌ని మనం చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చును . మిల్క్‌మైడ్‌ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలి..దానిని తయారుచేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము .
మిల్క్‌మైడ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
చిక్కని పాలు: అర లీటరు
పంచదార – 1 కప్పు లేదా 150 గ్రాములు
బేకింగ్ పౌడర్- పావు టీస్పూన్.
Condensed Milk:ఇంట్లోనే సులభంగా మిల్క్ మెయిడ్‌ని తయారు చేసుకోవచ్చును
మిల్క్‌మైడ్ తయారు చేసే విధానం:-
ఒక కడాయిని ముందుగా నీటితో కడిగి అందులో పాలను పోయాలి. ఈ పాలను చిన్న మంటపై మీగడ కట్టకుండా గరిటెతో కలుపుతూ పాలు పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. పాలు మరిగిన తరువాత పంచదారను వేసి కలుపుతూ ఉండాలి.
పంచదార వేసిన తరువాత పాలు రంగు మారడాన్ని మనం గమనించవచ్చును . అర లీటర్ పాలు పావు వంతు మిగిలే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత బేకింగ్ పౌడర్ ను వేసి రెండు నిమిషాల పాటు ఉండలు లేకుండా కలిపి చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇలా చేయడం వల్ల బయట దొరికే విధంగా ఉండే మిల్క్ మెయిడ్ తయారవుతుంది.
దీనిని గాలి తగలని గాజు సీసాలో ఉంచి రిఫ్రిజిరేటర్ లో పెట్టి నిల్వ చేసుకోవచ్చును . ఇలా తయారు చేసిన మిల్క్ మెయిడ్ ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది. ఇలా నిల్వ చేసుకున్న మిల్క్ మెయిడ్ తో ఎంతో రుచిగా ఉండే తీపి పదార్థాలను తయారు చేసుకుని తినవచ్చును .
No comments
Post a Comment