తిరుమల శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసా

తిరుమల శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసా

తిరుమల శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసా
*తిరుమల  శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసా ??*
????????
ఏడుకొండలవాడా వెంకటరమణా..
గోవిందా..గోవిందా అంటూ..
అ స్వామిని చూడటానికి ఎంతో ఆత్రుతగా వెళితే, ఆయన్ని చూసే సమయం చాలా తక్కువ దొరుకుతుంది.
అలాంటి సమయంలో ఆయన వేసుకునే దండలు, ఎన్ని ఉన్నాయి అనేది చూడటానికి టైం దొరకదు.సమయం సరిపోదు.
ఆ ఆపదమొక్కుల వాడిని,
అనాధరక్షకుడిని చూస్తుంటే…
కళ్ళనిండా ఆనంద బాష్పాలతో
మనసు పొంగిపోతుంది.
అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలుసుందాం.
? *శిఖామణి* :
శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది.
? *సాలిగ్రామాలు* :
ఇవి రెండు మాలలు.
ఒక్కొక్కటి సుమారు 4 మూరలు ఉంటుంది.
శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు.
? *కంఠసరి* :
ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది.
మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడే దండ బకటి.
?. *వక్ష స్థల లక్ష్మి:*
ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది.
శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు రెండు దండలు.
?. *శంఖుచక్రం* :
శంఖుచక్రాలకు రెండు దండలు.
ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది.
? *కఠారి సరం:*
శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి రెండు మూరలు.
? *తావళములు* :
రెండు మోచేతుల కింద,
నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా,
మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ
వేలాడ దీసే మూడు దండలు ఒకటి
మూడు మూరలు ఉంటుంది.
రెండవది మూడున్నర మూరలు ఉంటుంది. మూడవది నాలుగు మూరలు ఉంటుంది.
?. *తిరువడి దండలు:*
శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది.
ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి,
పైన తెలిపిన మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలలమాలతో అలంకరిస్తారు
? *జై శ్రీమన్నారాయణ*?
Previous Post Next Post

نموذج الاتصال