శ్రీమహాలక్ష్మి చేతిలో శివలింగం ఉన్న క్షేత్రం బండోరాలోని శ్రీ మహాలక్ష్మీ ఆలయం.
గోవా రాష్ట్రంలోని పోండా నుండి నాలుగు కి.మీ దూరంలో ఉన్నది. శ్రీ మహాభారతం కాలంలో గోమంపర్వత ప్రాంతమే ఇప్పుడు గోవాగా పిలవబడుతుంది. ఈ ప్రాంతంలో మహాశివునికి అంకితమైన నాగూషీ ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో శ్రీమహాలక్ష్మీ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. కారణం గుర్బగుడిలో దర్శనమిస్తున్న అమ్మవారి అరచేతిలో శివలింగం ఉండటమే. ఇరవైనాలుగు శక్తి పీఠాలలో ఒకటి అని కాళికాపురాణం ప్రకారం చెబుతారు.
No comments