గ్రహ దోషాలను తొలగించే స్నానపు యొక్క విధానాలు
సూర్య దోషం తొలగడానికి : ఆదివారం
మనం స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు లేదా ఎర్రటి పూలు ఆ బకెట్లో కొంచెం వేసి స్నానం చేస్తే సూర్య దోషం తగ్గుతుంది.
చంద్ర దోషం తొలగడానికి: సోమవారం
నీటిలో కొంచెం పాలు లేదా పెరుగు గాని వేసుకుని స్నానం చేస్తే చంద్ర దోషం తగ్గుతుంది.
కుజదోషం తొలగడానికి: మంగళవారం
నీటిలో బిల్వ ఆకులను లేదా బిల్వ ఆకు పొడిని గాని వేసి స్నానం చేస్తే కుజదోషం తగ్గుతుంది.
బుదదోషం తొలగడానికి: బుధవారం
సముద్రపు నీరు లేదా గంగా నది నీరు గాని లేక రాళ్ల ఉప్పు గాని వేసి స్నానం చేస్తే బుధ దోషం తగ్గుతుంది.
గురు దోషం తొలగడానికి: గురువారం
నల్ల యాలకులను నీటిలో ఉడికించి వాటిని మనం స్నానం చేసే నీటిలో పోసి స్నానం చేస్తే గురు దోషం తగ్గుతుంది.
శుక్ర దోషం తొలగడానికి: శుక్రవారం
నీటిలో యాలకులను ఉడికించి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శుక్ర దోషం తగ్గుతుంది.
శని దోషం తొలగడానికి: శనివారం
నీటిలో నల్ల నువ్వులను వేసి స్నానం చేస్తే శని దోషం తగ్గుతుంది.
రాహు దోషం తొలగడానికి: శనివారం
మహిషా సిని పొడిచేసి నీటిలో ఉడకబెట్టాలి. ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే రాహు దోషం తగ్గుతుంది.
కేతు దోషం తొలగడానికి: మంగళవారం
గరిక (గడ్డి) నీ నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే కేతు గ్రహ దోషం తగ్గుతుంది.
ఆయా రోజుల్లో స్నానాన్ని ఆచరించి గ్రహ దోషాలను తగ్గించుకోవచ్చును.
No comments