Ullipaya Rasam:శరీరానికి అత్యంత మేలు చేసే ఉల్లిపాయ రసం ఇలా చేయండి
Ullipaya Rasam: మనం వండుకునే పదార్థాలలో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయ లేకుండా వంట లేదు. ఏ వంటకం చేసినా అందులో ఏదో ఒక రకంగా మనం ఉల్లిపాయలను ఉపయోగిస్తూనే ఉంటాం. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ఇది చాలా మేలు చేస్తుంది. వివిధ వంటకాలలో దీనిని ఉపయోగించడంతో పాటు, ఉల్లిపాయతో మనం ఎంతో రుచిగా రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చును .
ఉల్లిపాయ రసం చాలా రుచికరమైనది. ఇది తయారు చేయడం కూడా సులభం. ఉల్లిపాయలతో రసాన్ని ఎలా తయారు చేసుకోవాలి. దీని తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ రసం తయారీకి కావలసిన పదార్థాలు:-
తరిగిన ఉల్లిపాయ- 1 (పెద్దది)
తరిగిన పచ్చిమిర్చి – 2
తరిగిన బంగాళదుంపలు -2 (మధ్యస్థం)
కరివేపాకు – ఒకటి రెబ్బ
పసుపు -అర టీస్పూన్
టమోటా గుజ్జు – 1 కప్పు
చింత పండు రసం – తగినంత
మినప పప్పు – ఒక టీస్పూన్
మెంతులు- పావు కప్పు
జీలకర్ర -పావు టీస్పూన్
ఆవాలు – పావు టీస్పూన్
శనగపప్పు – అర టీస్పూన్
ఎండు కొబ్బరి – పావు టీస్పూన్
ఎండుమిర్చి, తగినంత
ఉప్పు – తగినంత
నీరు తగినంత
తాలింపు తయారీకి కావలసిన పదార్థాలు:-
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు, పావు టీస్పూన్
శెనగలు, అర టీస్పూన్
జీలకర్ర- పావు టీస్పూన్
ఎండు మిర్చి – 2
అల్లం ముక్కలు – 1 టీస్పూన్
వెల్లుల్లి -ఒక టీస్పూన్
కరివేపాకు- ఒకటి రెబ్బ.
Ullipaya Rasam:శరీరానికి అత్యంత మేలు చేసే ఉల్లిపాయ రసం ఇలా చేయండి
ఉల్లిపాయ రసం తయారు చేసే విధానం :-
ఒక కడాయిలో మినప పప్పును, మెంతులను, జీలకర్రను మరియు ఆవాలను, శనగ పప్పును వేసి దోరగా వేయించుకోవాలి.అలా వేయించిన వాటిని చలార్చి ఒక జార్ లో వేసి పొడి చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని దానిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలను, ఉప్పును, కరివేపాకును, తరిగిన పచ్చి మిర్చిని, పసుపును వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.నీరు ఉడికిన తరువాత టమాట గుజ్జును, చింతపండు రసాన్ని, ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని, కారాన్ని, ఎండు కొబ్బరిని వేసి బాగా మరిగించాలి.
ఇప్పుడు ఒక కడా యిలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత తాళింపు పదార్థాలను ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించి మరుగుతున్న రసంలో వేసి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ రసం తయారవుతుంది. ఈ రసాన్ని అన్నంతో కలిపి తీసుకుంటే రుచిగా ఉండటమే కాకుండా మీ శరీరానికి మేలు చేస్తుంది.
No comments
Post a Comment