Oats Dosa:రుచికరమైన ఓట్స్ దోశ ఇలా తయారు చేసుకొండి

 

Oats Dosa : మనం ఎక్కువగా ఉపయోగించే ధాన్యాలలో ఓట్స్ ఒకటి. ఇవి పోషక విలువలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలకు గొప్ప మూలం. ప్రతిరోజూ మీ ఆహారంలో భాగంగా ఓట్స్ మీ శరీరంలోని కొవ్వును కరిగించడంలో బాగా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. గుండెజబ్బులను నివారిస్తుంది. ఓట్స్ కూడా మనకు మేలు చేస్తాయి. కొంతమంది నేరుగా ఓట్స్ తినడానికి ఇష్టపడరు. అయితే, ఈ దోషాలతో మీరు వాటిని పొందవచ్చు. అవి రుచికరంగా ఉండటమే కాదు… దోశలు మన శరీరానికి ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వోట్‌మీల్‌ని ఉపయోగించి దోశ వండడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఓట్స్ దోశ తయారీకి కావలసిన పదార్థాలు:-

ఓట్స్ – అరకప్పు
బియ్యం పిండి- అరకప్పు
జీలకర్ర- 1 టీస్పూన్
బొంబాయి రవ్వ – పావు కప్పు
పెరుగు – అరకప్పు
అల్లం తురుము – ఒక టీస్పూన్
పచ్చిమిర్చి 2 టీస్పూన్లు
కారం పొడి- అర టీస్పూన్
కొత్తిమీర- 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు- సుమారు అరకప్పు
ఉప్పు -తగినంత
నీరు- మూడు కప్పుల
నూనె-తగినంత

 

Oats Dosa:రుచికరమైన ఓట్స్ దోశ ఇలా తయారు చేసుకొండి

ఓట్స్ దోశను తయారు చేసే విధానము:-

ముందుగా ఒక మిక్సీ తీసుకొని దానిలో ఓట్స్ను వేసి పొడి చేసుకోవాలి.అలా పొడి చేసిన దానిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెలో బియ్యప్పిండి పెరుగు, రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో జీలకర్ర, అల్లం తురిమిన పచ్చిమిర్చి తురిమిన మిరియాల పొడి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు మరియు రుచికి సరిపడా ఉప్పును నీటిని పోసి బాగా కలిపి సుమారు 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేడి చేయాలి. అలా వేడి అయిన పాన్ మీద కొంచెం నూనె వేసి గరిటె సహాయంతో పిండి మిశ్రమాన్నిరవ్వ దోశ మాదిరిగా అప్లై చేయవచ్చును. ఒక వైపు కాలిన తరువాత మరొక వైపు వేసి బాగా కాల్చాలి. ఈవిధముగా ఓట్స్ దోశ తయారవుతుంది . దీన్ని ఇష్టమైన కూర లేదా చట్నీతో తిని ఆనందించవచ్చును .ఇది రుచికరమైనది. ఇంకా ఓట్స్‌లో ఉండే పోషకాలు మనకు సులభంగా లభిస్తాయి. ఓట్స్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.