Bachalikura Pappu:రుచికరమైన బచ్చలికూర పప్పు ఇలా తయారు చేయండి
Bachalikura Pappu : బచ్చలికూర పప్పు అనేది మనం ఆహారం కోసం వైవిధ్యమైన ఆకుకూరలను తీసుకునే ఒక రకమైన ఆహారం. ఆకుకూరలు మీ ఆరోగ్యానికి అద్భుతమైనవి. మనం తినే ఆకు కూరల్లో బచ్చలికూర ఒకటి. ఇతర ఆకు కూరల మాదిరిగానే బచ్చలికూర మన శరీరానికి మేలు చేస్తుంది. బచ్చలికూర ఎముకల బలాన్ని కాపాడటంలో మరియు రక్తహీనత సమస్యను తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బచ్చలికూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. బచ్చలికూర మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
మనకు రెండు రకాల బచ్చలికూరలు ఉన్నాయి: తెలుపు లేదా ఎరుపు. బచ్చలి కూర వేపుడు లేదా పప్పుగా కూడా తయారు చేసుకోవచ్చును . బచ్చలి కూరతో చేసిన పప్పు చాలా రుచిగా ఉంటుంది. బచ్చలి కూరతో పప్పును ఎలా తయారు చేసుకోవాలి.దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బచ్చలి కూర పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
తరిగిన పాలకూర కూర- ఒకటిన్నర కప్పు
కంది పప్పు – ఒక కప్పు
టొమాటో తరిగిన – నాలుగు
చింతపండు – కొద్దిగా
తరిగిన పచ్చిమిర్చి – 10
నీరు – తగినన్ని
ఉప్పు- రుచికి తగినంత
పసుపు – టీ అర టీస్పూన్.
తాలింపు చేయడానికి కావలసిన పదార్థాలు..
నూనె – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర 1/2 టీస్పూన్
ఆవాలు 1/2 టీస్పూన్
ఎండు మిరపకాయలు- 2
కరివేపాకు – 1 రెమ్మ
తరిగిన ఉల్లిపాయ-1
పచ్చి వెల్లుల్లి రెబ్బలు- 5.
Bachalikura Pappu:రుచికరమైన బచ్చలికూర పప్పు ఇలా తయారు చేయండి
బచ్చలికూర పప్పు తయారు చేసే విధానము:-
ముందుగా కందిపప్పును తీసుకొని కుక్కర్‌లో వేసి తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడుకోవాలి . తరువాత దానిలో బచ్చలికూర మరియు ఉప్పు మినహా మిగిలిన పదార్థాలను వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కుక్కర్‌ను పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. కొద్ది సమయం తరువాత కుక్కర్ మూత తీసి పప్పును మెత్తగా చేసుకోని దానిలో తగినంత ఉప్పను వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో నూనె వేసి వేడి చేయాలి . నూనె వేడి అయినా తరువాత తాళింపు పదార్థాలన్నింటినీ వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా తాళింపు వేగిన తరువాత తరిగిన బచ్చలి కూరను వేసి చిన్న మంట మీద బచ్చలి కూరను మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలా బచ్చలి కూర ఉడికిన తరువాత ముందుగా ఉడికించిన పప్పును వేసి బాగా కలుపుకోవాలి . ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధముగా రుచిగా ఉండే బచ్చలి కూర పప్పు తయారవుతుంది
ఈ పప్పు అన్నం, చపాతీ, రాగి సంగటి మరియు రోటీలతో పాటు కలిపి తింటే చాలా రుచికరమైనది. బచ్చలికూరతో పప్పు చేసుకొని తినడం వల్ల నిద్రలేమిని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.
Tags: how to make pappu bachali kura,howtomakebachalikurapappu,how to make bachali kura pappu,how to make bachalikura pappu recipe,how to make bachali kura pappu in telugu,how to make bachali pappu,how to cook pappu bachali kura,bachali kura tomato pappu,bachalikura pappu,pappu bachali kura,bachali kura pappu,bachalikurapappu,how to prepare bachalikura pappu,how to prepare bachali kura pappu,#bachalikurapappu,bacchali kura pappu,bachali kura pappu telugu
No comments
Post a Comment