Cauliflower Tomato Curry:రుచికరమైన కాలిఫ్లవర్ టమాట కూరను ఇలా చేసుకొండి
Cauliflower Tomato Curry: మనం వంటింట్లో టమాటాలను ఎక్కువగా వాడుతాము . టమాటలను నేరుగా లేదా వివిధ కూరగాయలతో కలిపి కూరలను తయారు చేస్తాము . ఈ విధంగా తయారు చేసే కూరలల్లో కాలీఫ్లవర్ టమాట కూర కూడా ఒకటి. ఈ వంటకం ఎంత రుచికరమైనదో మనందరం విన్నాము.
రుచికరమైన కాలీఫ్లవర్‌ను మీ ఆహారంలో రెగ్యులర్‌గా చేర్చుకోవడంతోపాటు ఎముకలు బలపడతాయి. గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. కాలీఫ్లవర్ గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది.
అదనంగా, ఆహారం కోసం కాలీఫ్లవర్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాలీఫ్లవర్ ను అందరూ తప్పకుండా ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాలీఫ్లవర్ టొమాటో కర్రీలో కసూరి మెంతి ని వేసి మరింత రుచిగా తయారు చేసుకోవచ్చును . కసూరి మెంతితో క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీని ఎలా తయారుచేయాలి . దానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాలీఫ్లవర్ టొమాటో కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
తరిగిన కాలీఫ్లవర్- 200 గ్రా
టొమాటోలు – 2. (పెద్దది)
కసూరి మెంతి -2 టేబుల్ స్పూన్లు
నూనె- 2 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క- 1
ఏలకులు- 2
లవంగాలు- 3
జీలకర్ర- 1/4 టీస్పూన్
ఆవాలు – 1/4 టీస్పూన్
మినప పప్పు- ఒక టీ స్పూన్
వేరుశెనగ పప్పు -అర టీ స్పూన్
పచ్చిమిర్చి- 2
ఉల్లిపాయ పేస్ట్- 3 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు – ఒకటి రెబ్బ
పసుపు – 1/2 టీ స్పూన్
కారం- 2 టీ స్పూన్లు,
ఉప్పు- రుచికి తగినంత
ధనియాల పొడి – ఒక టీస్పూన్
గరం మసాలా 1 టీ స్పూన్
నీరు – ఒకటిన్నర కప్పులు
తరిగిన కొత్తిమీర – చిన్న మొత్తం.
Cauliflower Tomato Curry:రుచికరమైన కాలిఫ్లవర్ టమాట కూరను ఇలా చేసుకొండి
కాలీఫ్లవర్ టొమాటో కర్రీని తయారు చేసే విధానం:-
ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి . దాని మీద ఒక గిన్నె పెట్టి దానిలో అర లీటరు నీటిని పోసి బాగా చేసుకోవాలి . ఆ కాగిన నీటిలో తరిగిన కాలీఫ్లవర్ వేసి 5 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్‌లో ఉండే పురుగులు, మలినాలు అన్నీ పోతాయి.
టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సి జార్ లో వేసి పేస్ట్ లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసి కాగిన తరువాత లవంగాలు, యాలకులు,దాల్చిన చెక్క వేసి బాగా వేయించాలి. ఆలా వేగిన తరువాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపపప్పు వేసి వేయించుకోవాలి. తరువాత దీనికి పచ్చి మిర్చి, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కరివేపాకు కూడా వేసి వేయించాలి.
ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ఎర్రగా వేగిన తరువాత టమాట పేస్ట్ను, పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి.అలా ఉడికించిన 5 నిమిషాల తరువాత కాలీఫ్లవర్ ను, తగినన్ని నీళ్లను పోసి కలిపిన తరువాత కసూరి మెంతిని వేసి మరోసారి కలిపి మూతపెట్టి కాలీఫ్లవర్ పూర్తిగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్ ఉడికిన తరువాత కొత్తిమీరను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధముగా ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ టమాట కూర తయారవుతుంది.
ఈ కూర తయారీలో కసూరి మెంతికూరకు బదులుగా మెంతి ఆకులను కూడా తీసుకోవచ్చును . ఈ కూరను అన్నం కాకుండా రోటీ, చపాతీ లేదా పుల్కాతో సర్వ్ చేస్తే బాగుంటుంది. తరచుగా చేసే టొమాటో కాలీఫ్లవర్ కర్రీకి బదులుగా కసూరి మెంతితో చేసిన ఈ కూర చాలా రుచికరమైనది. దీన్ని ఈ పద్ధతిలో తయారు చేసుకుని తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చును .
No comments
Post a Comment