Atukula Payasam :ఆరోగ్యకరమైన అటుకుల పాయసం ఇలా తయారు చేసుకోండి

 

Atukula Payasam: మనకు లభించే అనేక రకాల ఆహారాలలో అటుకుల కూడా ఒకటి. ఇది బియ్యంతో తయారు చేయబడింది. అయినప్పటికీ, అవి అన్నం కంటే చాలా తేలికగా జీర్ణమవుతాయి. వాటిలో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అటుకులని మీ ఆహారంలో రెగ్యులర్ భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు అందుతాయి. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇవి గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.

అటుకుల‌లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ అటుకుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే అటుకులని ఉపయోగించి చాలా రకాల ఆహారాలను తయారుచేస్తారు. అందులో అటుకుల పాయసం ఒకటి. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, మనకు అవసరమైన పోషకాలను అందిస్తుంది మరియు మన శక్తిని పెంచుతుంది. దీన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

 

 

అటుకుల పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-

అటుకులు: ఒక కప్పు
పాలు – రెండు కప్పులు
నీరు – రెండు కప్పులు
తురిమిన బెల్లం- 1 కప్పు
. నెయ్యి రెండు- టీ స్పూన్లు
జీడిపప్పు -2 టేబుల్ స్పూన్లు
బాదం- 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి రేకులు- 2 స్పూన్లు
యాలకుల పొడి- 1/2 టీ స్పూన్.

Atukula Payasam :ఆరోగ్యకరమైన అటుకుల పాయసం ఇలా తయారు చేసుకోండి

అటుకుల పాయసం తయారు చేసే విధానం:-

ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి వేడి చేసుకోవాలి.ఇప్పుడు కడాయి వేడి అయినా తరువాత దానిలో అటుకుల‌ను వేసి 3 నిమిషాల పాటు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.అదే కడాయిలో కొంచెము నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కాగాక దానిలో బాదం ప‌ప్పు, జీడి ప‌ప్పు ,ఎండు కొబ్బ‌రి ముక్క‌లు వేసి బాగా వేయించి వీటిని కూడా మ‌రో ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

అదే క‌డాయిలో బెల్లం వేసుకొని దానికి 4 టేబుల్ స్పూన్ల నీళ్ల‌ను వేసి బెల్లం క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లం క‌రిగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి బెల్లం నీటిని జల్లిగంటెతో వ‌డ‌బోసుకోవాలి. దీని వల్ల బెల్లంలో ఉండే మ‌లినాలు తొల‌గిపోతాయి.

త‌రువాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వేడి అయిన గిన్నెలో పాలు, నీళ్లు పోసి బాగా మ‌రిగించాలి. ఇప్పటికే వేయించిన అటుకులని మరుగుతున్న పాలలో వేసి మెత్తగా ఉడికించాలి.అవి మెత్త‌గా ఉడికిన తరువాత స్ట‌వ్ ను చిన్న మంట మీద ఉంచి ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న బెల్లం నీటిని మరియు యాల‌కుల పొడిని వేసి క‌లిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి.

ఇప్పుడు వేయించి పెట్టుకున్న బాదం పప్పు, జీడి ప‌ప్పు, ఎండు కొబ్బ‌రి ముక్క‌లతోపాటు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఈ విధముగా ఎంతో రుచిగా ఉండే అటుకుల పాయ‌సం త‌యార‌వుతుంది.త‌రుచూ చేసుకునే పాయ‌సానికి బ‌దులుగా అప్పుడ‌ప్పుడూ అటుకుల‌తో పాయ‌సాన్ని చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందుతారు.