ఇప్పనూనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

సపోటేసి కుటుంబానికి చెందిన అడవి చెట్టు ఇప్ప. ఇప్పచెట్టు వృక్షశాస్త్రనామం మధుక లాంగిపొలియా,, మధుక ఇండిక .   భారతదేశంలోని గిరిజనులు ఇప్పచెట్టును  పవిత్రంగా భావిస్తారు. ఇప్ప పువ్వుల నుండి తీసిన నూనె వంట కోసం వాడతారు. ఇప్ప నూనె కి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇప్పనూనెను చర్మరక్షణ తైలంగా. కీళ్లనొప్పులకు మర్ధననూనెగా వాడుతారు.  శుద్ధికరించిన నూనెను వనస్పతి, సబ్బులు, కొవ్వొత్తులు, ఫ్యాటి ఆమ్లాలు ఉత్పత్తిలో వినియోగిస్తారు.గిరిజనులు ఇప్పపూలను ఆహారంగా కూడా తీసుకుంటారు. ఇప్పచెట్టు కలపను ఇంటి తలుపులు, గుమ్మాలు, కిటికిలు, ఎడ్లబళ్ల చక్రాల తయారిలో కూడా  వాడతారు. అయితే ఇది ఎక్కువగా ఉష్ణమండల అడవులు, బయలు, మైదాన భాగల్లో పెరుగుతుంది. కానీ గ్రామాల్లో కూడా ఇప్పచెట్లు కన్పిస్తాయి.

గిరిజనులు జరుపుకునే సంప్రదాయ వేడుకలు అయిన  సంబరాలు, పెళ్ళి సమయంలో ఇప్పపూల నుండి తయారు చేసిన సారాను త్రాగడం ఆచారంగా పాటిస్తారు. ఇప్పపూలను, ఊటబెల్లాన్ని చేర్చి, పులియబెట్టి సారాను తయారు చేస్తారు. ఇది తీయగా ఉంటుంది. మనకు బయట దొరికే బ్రాందీ, విస్కీలకన్నా కోటిరెట్లు మెరుగ్గా ఉంటుంది.

 

 

ఇప్పనూనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలు 

గొంతు వాపుకు : గొంతువాపుతో ఆహారాన్ని మింగలేని వారు ఇప్పపువ్వు 3 గ్రాములు కొద్దికొద్దిగా నమిలి, నీళ్లతో మింగుతూ ఉండాలి. ఇలా తరచూ  చేస్తూ ఉంటే గొంతు వాపు తగ్గి తినగలుగుతారు.

ఎక్కిళ్ళకు : ఇప్పపూలను దంచి తీసిన రసానికి తేనెను కలిపి, 4 చుక్కలు ముక్కులో వేసి పీలిస్తే ఎక్కిళ్ళు తొందరగా  ఆగిపోతాయి.

అతిదాహానికి : ఇప్పపువ్వు బుగ్గన పెట్టుకుని చప్పరించి, రసం మింగుతూ ఉంటే అతిదాహం కూడా  తగ్గిపోతుంది.

పెదవులకు : ఇప్ప చెక్కను శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి,  బయట ఆరబెట్టి దంచుకోవాలి, దంచిన ఆ పొడిని పలుచని నూలు బట్టలో వేసి వడగట్టుకోవాలి. అప్పుడు వచ్చిన సన్నని ఇప్పచెక్క పొడికి కొంచం నెయ్యి కలిపి పెదవులపైన లేపనం వేస్తూ ఉంటే.. పెదవుల పగుళ్లు, పుండ్లు, నల్లధనం తగ్గిపోయి మృదువుగా  కూడా మారతాయి.

 రక్త పైత్యానికి : ఇప్పచెట్టు బెరడు 10 గ్రాములు కడిగి, నలగ్గొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా  మరిగించాలి. ఈ కషాయాన్ని చల్లార్చి రెండు లేదా మూడు పూటలా ఒక కప్పు తాగుతూ ఉంటే శరీరంలోని ఏ భాగంలో నుండి రక్తం పోతున్నా ఆగిపోతుంది. ఇంకా ఇప్పచెట్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

  • అమ్మమ్మ చిట్కాలను తెలుసుకోండి, వారు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతారు
  • అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
  • అరటిపండు – అద్భుతమైన ఫలం
  • అరికెలు యొక్క ఉపయోగాలు
  • అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
  • అర్జున్ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
  • అలసటను దూరము చేసే ఆహారము
  • అలసందలు(బొబ్బర్లు ) అందించే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
  • అలోవెరా (కలబంద) యొక్క ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
  • అల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
  • అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
  • అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసుకోండి
  • అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు
  • అల్లం యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు