పక్షం యొక్క పూర్తి వివరాలు 

పక్షం అనగా  పదిహేను  రోజులు. కనుక నెలకు రెండు పక్షాలు ఉంటాయి.

అవి :-

శుక్ల పక్షం

కృష్ణ పక్షం

శుక్ల పక్షం

శుక్ల పాడ్యమి రోజు నుంచి పౌర్ణమి వచ్చే వరకు శుక్ల పక్షం లేదా  శుద్ద పక్షం అని అంటారు.

కృష్ణ పక్షం

బహుళ పాడ్యమి రోజు నుంచి అమావాస్య వచ్చే వరకు కృష్ణ పక్షం లేక బహుళ పక్షం అంటారు.

 

పక్షానికి పదిహేను తిధులు:

 

 పాడ్యమి విదియ
తదియచవితి
పంచమి షష్ఠి
సప్తమిఅష్టమి
నవమిదశమి
ఏకాదశి ద్వాదశి
త్రయోదశిచతుర్దశి
పూర్ణిమ లేక అమావాస్య

 

పక్షంలోని తిథుల యొక్క అధి దేవతలు 

పాడ్యమి యొక్క అధి దేవత – అగ్ని

విదియ యొక్క అధి దేవత – బ్రహ్మ

తదియ యొక్క అధి దేవత – గౌరి

చవితి యొక్కఅధి దేవత – వినాయకుడు

పంచమి యొక్క అధి దేవత – సర్పము

షష్ఠి యొక్క అధి దేవత – కుమార స్వామి

సప్తమి యొక్క అధి దేవత – సూర్యుడు

అష్టమి యొక్క అధి దేవత – శివుడు

నవమి యొక్క అధి దేవత – దుర్గా దేవి

దశమి యొక్క అధి దేవత – యముడు

ఏకాదశి యొక్కఅధి దేవత – శివుడు

ద్వాదశి యొక్క అధి దేవత – విష్ణువు

త్రయోదశి యొక్క అధి దేవత – మన్మధుడు

చతుర్దశి యొక్క అధి దేవత – శివుడు

పౌర్ణమి లేక అమావాస్య యొక్క అధి దేవత – చంద్రుడు