ఏకాదశి ఎన్ని ఉన్నాయి వాటి వివరాలు

ఏకాదశి ఎన్ని ఉన్నాయి వాటి వివరాలు

* సంవత్సర  పొడుగునా నెలకి రెండు పక్షాలు 1.శుక్ల పక్షము ,2. కృష్ణ పక్షము ఉంటాయి  .పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదషులుంటాయి . ప్రతి నెలా ఆమావాస్య  కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి .
* ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని “శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)” అంటారు. సంవత్సరం మొత్తంలోఇటువంటిశుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.
ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని ” బహుళ ఏకాదశి ” సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .
  • మాసము/పక్షము/తిథి—– పర్వదినం
  • చైత్ర శుద్ధ ఏకాదశి———- కామదైకాదశి
  • చైత్ర బహుళ ఏకాదశి —— వరూధిన్యైకాదశి
  • వైశాఖ శుద్ధ ఏకాదశి— —- మోహిన్యైకాదశి
  • వైశాఖ బహుళ ఏకాదశి —- అపరఏకాదశి
  • జేష్ఠ శుద్ధ ఏకాదశి ——— నిర్జలైకాదశి
  • జేష్ఠ బహుళ ఏకాదశి——- యోగిన్యైకాదశి
  • ఆషాఢ శుద్ధ ఏకాదశి —— తొలిఏకాదశి, శయనైకాదశి
  • ఆషాఢ బహుళ ఏకాదశి- — కామ్యైకాదశి
  • శ్రావణ శుద్ధ ఏకాదశి—- — పుత్రఏకాదశి
  • శ్రావణ బహుళ ఏకాదశి —- అజైకాదశి
  • భాద్రపద శుద్ధ ఏకాదశి—- -పరివర్తన్యైకాదశి
  • భాద్రపద బహుళ ఏకాదశి– ఇంద్రఏకాదశి
  • ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి- – మహాజ్జయేకాదశి
  • ఆశ్వయుజ బహుళ ఏకాదశి- రమైకాదశి
  • కార్తీక శుద్ధ ఏకాదశి ——— ఉత్థానైకాదశి, బోధనైకాదశి
  • కార్తీక బహుళ ఏకాదశి—— ఉత్పత్యైకాదశి
  • మార్గశిర శుద్ధ ఏకాదశి —— ధృవైకాదశి, ఉత్తమైకాదశి
  • మార్గశిర బహుళ ఏకాదశి—- సఫలైకాదశి
  • పుష్య శుద్ధ ఏకాదశి ——— వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
  • పుష్య బహుళ ఏకాదశి—– తిలైకాదశి
  • మాఘ శుద్ధ ఏకాదశి——- భీష్మఏకాదశి, జయైకాదశి
  • మాఘ బహుళ ఏకాదశి—- విజయైకాదశి
  • ఫాల్గుణ శుద్ధ ఏకాదశి—— అమలవైకాదశి
  • ఫాల్గుణ బహుళ ఏకాదశి— పాపవిమోచననైకాదశి
Previous Post Next Post

نموذج الاتصال