అందం ఆరోగ్యాన్నందించే కీరా
కీరా లో అధికమోతాదులో ఉండే నీరు డిహైడ్రాషన్ ను తగ్గిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది.
కొలస్ట్రాల్ ను తగ్గించి బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది మంచి ఆహరం.
కీరా జ్యూస్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కీరా ని గుండ్రటి ముక్కలుగా చేసి కళ్ళమీద పెట్టుకోవడం వల్ల కళ్ళ వాపు, డార్క్ సర్కిల్స్ తగ్గించడమేకాక కళ్ళని చల్లబరుస్తుంది.
కీరా ని నమిలి తినడం వల్ల నోటి దుర్వాసనని తగ్గిస్తుంది.
కీరా జ్యూస్ లో క్యారెట్ రసం సమపాళ్లలో కలిపి రోజు తీసుకుంటుం ఉండటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
తక్కువ కాలరీస్ కలిగివుండి, కడుపు నిండినట్లుగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి అద్భుతమైన ఆహరం కీరా.
జీర్ణక్రియ పనితీరుని మెరుగుపరుస్తుంది. కడుపులో మంట, అల్సర్, ఎసిడిటి లను తగ్గిస్తుంది.
న్యూరల్ డామేజ్ ను తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.
ఫైబర్ ఎక్కువగా కలిగి ఉన్నందువల్ల మలబద్దక సమస్యను నివారిస్తుంది.
కీరా జ్యూస్ లో 4, 5 తులసి ఆకుల రసాన్ని చేర్చి తరుచు తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లను మూత్రం ద్వారా బయటికి పోయేలా చేస్తుంది.
జాయింట్ పెయిన్స్ కి కీరా రసం మంచి మెడిసిన్.
ఎముకల్ని దృడంగా చేస్తుంది, దంతాలు, గోళ్ళను సంరక్షిస్తుంది. లైయింగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది.
No comments