కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
బట్టతల, పేనుకొరుకుడు కి భృంగరాజ్ మొక్క ఆకుల నుండి వేరు వరకు తీసుకొని ముద్దగా చేసి ఇన్ఫెక్షన్ ఉన్నచోట రాయాలి.
తెల్ల వెంట్రుకలను తిరిగి నల్లగా మార్చడానికి భృంగరాజ్ థైలమ్ తయారుచేసి వాడాలి.
గుంటగలగర ఆకుల రసాన్ని తీసి జుత్తుకి పట్టించి పదిహేను నిముషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్ళు దృడంగా తయారయి జుట్టు ఆరోగ్యాంగా తయారవుతుంది.
తేలు, చిన్న చిన్న పురుగులు కుట్టి మంటగా ఉన్నచోట ఈ రసం పూస్తే మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.
గజ్జి, తామర, ఫంగస్ లాంటి వాటికీ పై పూతగా ఈ రసం రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
వీర్య వృద్ధికి, శృంగార శక్తిని పెంచడానికి మంచి మందు.
నోటిపూత, నోటి అల్సర్లకు ఈ రసం తో పుల్లింగ్ చేస్తూ ఉంటె తగ్గుతుంది.
భృంగరాజ్ బోధకాల కు పైపూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
చాల కంపెనీలు హెయిర్ ఆయిల్స్ తయారీలో ఈ మూలికాని ఎక్కువగా వాడుతున్నారు. అందువల్ల ఈ ఆయిల్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉన్నది .
జుట్టు నల్లబడటానికి హెర్బల్ హెయిర్ డై లలో దీనిని వాడుతున్నారు.
జుట్టు రాలటం, చిట్లిన జుట్టు, చుండ్రు, తెల్ల జుట్టు ఇంకా పేను కొరుకుడు వంటి అన్నిరకాల సమస్యలకు భృంగరాజ్ సరైన పరిష్కారం. అందువల్ల అందరు ఈ భృంగరాజ్ ఆయిల్, హెయిర్ డై, హెయిర్ ప్యాక్ ని వాడి దీని వళ్ళ కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందండి.
No comments
Post a Comment