అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద):
కలబంద గుజ్జును రోజ్ వాటర్ తో కలిపి శరీరానికి రాయాలి. అలా రాయటం వల్ల శరీరంలో ఉండే మృతకణాలు తొందరగా నశించి పోతాయి.
దంతక్షయానికి కారణం అయ్యే బాక్టీరియాను కలబంద నిర్మూలిస్తుంది. అందువల్ల అనేక రకాల టూత్పేస్ట్ లలో కలబందను ఎక్కువగా వాడుతున్నారు .
కలబంద గుజ్జులో నిమ్మరసం కలిపి తలకి పట్టించాలి. కొద్ది సమయం తరువాత తలస్నానం చేయాలి. కలబంద గుజ్జుతో హెయిర్ ఆయిల్ తయారుచేసి వాడటం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది. కలబంద వాడటం వలన చుండ్రు పోయీ , తలలో ఉండే పేళ్లు కూడా పోతాయి.
సోరియాసిస్ లాంటి నివారణ లేనటువంటి వ్యాధులకు కలబంద ఒక మంచి మందుగా సహకరిస్తుంది . కలబంద రసం లో కానుగ నూనెను కలిపి ఒంటికి పట్టించి 2లేదా 3 గంటల ఉంచి తరువాత స్నానం చేయాలి.
కలబంద జ్యూస్ వాడటం వాల్ల డయాబెటిస్, అల్సర్ మరియు బరువు తగ్గడంలో బాగా సాయపడుతుంది లైంగిక పటుత్వాన్ని పెంచడంలో కూడా కలబందను వాడుతారు.
గుండె, హెపటైటిస్ బి, కాన్సర్, వాపులు కిడ్నీ మరియు కీళ్లనొప్పులు ఇలాంటి చాల రకాల వ్యాధుల చికిత్సలో కలబందను వాడుతారు.
కలబంద గుజ్జులో పసుపు కలిపి ముఖానికి పట్టించడం వల్ల చర్మం చాలా మంచి గా తయారవుతుంది. కలబంద వాడటం వాల్ల కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్, ముడతలు, మచ్చలు, మరియు ప్రెగ్నెన్సీ తరువాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్ కూడా తగ్గి పోతాయి.
కలబంద రసంలో శొంఠిపొడి కలిపి తీసుకోవడం వల్ల ఎక్కిళ్ళు కూడా తొందరగా తగ్గిపోతాయి.
కాలిన గాయాలపై కలబంద గుజ్జును పూస్తే మంట తగ్గి. గాయాలకు సంబందించిన మచ్చలు కూడా లేకుండా చేస్తుంది.
ఆవుపాలలో 2 స్పూన్ల కలబంద రసం, పటికబెల్లం కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. మూత్ర సంబందిత సమస్యలను చాలా వరకు తొలగిపోతాయి.
గర్భిణీ స్త్రీలు కలబంద తీసుకోకూడదు.ఎందుకంటె అబార్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువ గా ఉంటుంది .
బాలింతలు కూడా కలబంద తీసుకోకూడదు. చిన్న పిల్లలకు విరేచనాలు అవుతాయి.
No comments
Post a Comment